క్రింది వచన భాగాన్ని చదివి 1 నుండి 5 వరకు ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి.
శ్రీరంగం శ్రీనివాసరావు క్రీ.శ. 1910లో విశాఖపట్టణంలో జన్మించారు. అప్పన్న కొండ వెంకట రమణయ్యలు వీరి తల్లిదండ్రులు. ఎనిమిదవ ఏటనే పొడుగు పొట్టిపాదాల కంద పద్యం రచించారు. "సావిత్రీ సత్యవంతులు" అనే పద్యనాటకాన్ని, "వీరసింహ విజయసింహులు" అనే నవలను తన కవితా సాధన దశలో రచించారు. పదిహేనవ ఏట వీరు రచించిన "పరిణయ రహస్యము" అనే నవల ముద్రితమైంది. శ్రీనివాసరావు పద్దెనిమిదవ ఏట వారు రచించిన "ప్రభవ* కావ్యం వెలువడింది. దీనికి శ్రీపురిపండా అప్పలస్వామి పీఠిక రచించారు. ఈ కావ్యం పైన కాల్పనికోద్యమ ప్రభావం ఉన్నది.
శ్రీశ్రీ 1928-31 సంవత్సరాలలో మద్రాసులో బి.ఏ చదివి డిగ్రీ తీసుకున్నారు. 1930లో టైఫాయిడ్ జ్వరంతో రెండు నెలలు బాధపడ్డారు. ఆ సమయంలో శ్రీశ్రీ ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. కవిత్వానికి ఛందస్సు ఆవశ్యకమనే భావం తొలగిపోయింది. దేశదేశాల కవుల రచనలు చదవడంతో ఆయన ఊహాపరిధి విస్తృతమైంది.
శ్రీశ్రీ బ్రతుకుతెరువు కోసం రకరకాల ఉద్యోగాలు చేశారు. మొదట మిసెస్ ఏ.వి.యన్. కాలేజీ విశాఖపట్టణంలో డిమాన్ స్ట్రేటర్గా, హార్బరులో గుమాస్తాగా, "విశాఖ" పత్రికలో రిపోర్టర్గా, ఆంధ్రప్రభలో సబ్-ఎడిటర్గా, ఆలిండియా రేడియోలో ఉ ద్యోగిగా, ఆనందవాణిలో సబ్-ఎడిటర్గా, నైజాం కొలువులో ఉద్యోగిగా, సినిమా రచయితగా ఎన్నో ఉద్యోగాలు చేశారు.